తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి భారీస్థాయిలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన 27వ తేదీ హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్‌లో ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించారు. ప్లీనరీ నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించారు. ప్లీనరీ ఆహ్వాన కమిటీలో రవాణాశాఖమంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి ఉన్నారు. సభాప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు పార్కింగ్, నగర అలంకరణ, వాలంటరీస్, భోజన కమిటీ, మీడియా కోఆర్డినేటర్స్, సాంస్కృతిక కమిటీలకు బాధ్యులను నియమించారు. ఇప్పటికే ఆరుగురితో తీర్మానాల కమిటీ ఏర్పాటైంది. ఈ ప్లీనరీకి 12 నుంచి 15 వేల మంది హజరుకానున్నారు.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వందమందికిపైగా ఆహ్వానిస్తున్నారు. పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుం డా పార్కింగ్, ప్రతినిధుల నమోదు, భోజనాల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. నోరూరించే తెలంగాణ వంటకాలను వడ్డిస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సాంస్కృతిక కార్యక్రమా లు ఉంటాయి. ప్లీనరీ సందర్భంగా నగరంలో అనుమతించిన ప్రాంతా ల్లో హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తారు. వివిధ జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే ముఖద్వారాల వద్ద స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తారు. పార్టీ ప్రతినిధులకు సాయం అందించేందుకు వలంటీర్లను నియమిస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ, చల్లటి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు ఈనెల 27న శుక్రవారం ఉదయం 10 గంటకల్లా ప్రాంగణానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు.

Visit Us On FacebookVisit Us On TwitterVisit Us On Youtube