ఐపిల్ 2018

హైదరాబాద్‌: మరోసారి అభిమానులకు సిసలైన టీ20మజా దొరికింది. హైదరాబాద్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబయి నిర్దేశించిన 148పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ చివరి బంతికి ఛేదించింది. దీపక్‌ హుడా 32నాటౌట్‌ (25) చివరి వరకూ నిలిచి జట్టును ముందుండి నడిపించగా, ఆఖరి బంతికి టెయిలండర్‌ స్టాన్‌లేక్‌ 5 నాటౌట్‌ (2) భారీ షాట్‌ కొట్టి సన్‌రైజర్స్‌కు ఉత్కంఠభరిత విజయాన్ని అందించాడు. అంతకుముందు ఓపెనర్‌ ధావన్‌ 45(28) దూకుడుగా ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ధావన్‌ అవుట్‌ అయిన తర్వాత సన్‌రైజర్స్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. 13ఓవర్‌ ముగిసేసరికి 107/5 పటిష్ఠంగా ఉన్న సన్‌రైజర్స్‌ 19ఓవర్‌కు వచ్చేసరికి 137/9గా ఉంది. 18వ ఓవర్‌లో బుమ్రా, 19వ ఓవర్‌లో ముస్తాఫిజర్‌ చెరో రెండు వికెట్లు తీసి హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో సన్‌రైజర్స్‌ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 11పరుగులు కావాల్సి వచ్చింది. ఈ దశలో చివరి ఓవర్‌ వేసిన కట్టింగ్‌ కాస్త ఒత్తిడికిలోను కావడంతో సన్‌రైజర్స్‌ విజయాన్ని దక్కించుకుంది.

Visit Us On FacebookVisit Us On TwitterVisit Us On Youtube