ఆంధ్రప్రదేశ్

విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నివాళులర్పించడానికి వచ్చిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పూలే విగ్రహానికి సీఎం నివాళులర్పించడానికి వస్తున్నందున భద్రతా కారణాల దృష్ట్యా సీఎం నివాళులర్పించిన అనంతరం అనుమతిస్తామని కాంగ్రెస్‌ నాయకులకు పోలీసులు సూచించారు. అందుకు రఘువీరా, కేవీపీ ససేమిరా అనడంతో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన రఘువీరా, కేవీపీ, సహా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాలరాసినట్టేనని కాంగ్రెస్‌ నేతలు.. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు పళ్లం రాజు, జేడీశీలం,సి.రామచంద్రయ్య, కనుమూరి బాపిరాజు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

Visit Us On FacebookVisit Us On TwitterVisit Us On Youtube